సూర్యాపేట,(విజయక్రాంతి): యేస్తుక్రీస్తు బోధనలు అందరికి ఆదర్శమని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. క్రిస్మస్ పర్వదినం సందర్బంగా జిల్లా కేంద్రంలోని నిర్మల మాతా చర్చి సిల్వి సిలోయం చర్చి గ్రేస్ చర్చి మన్నా చర్చి, సెయింట్ బాప్టిస్ట్ చర్చిలలో బుధవారం జరిగిన వేడుకలలో ఆయన పాల్గొని కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం జగదీశ్ రెడ్డి మాట్లాడుతూ... అన్ని మతాల ప్రధాన పండుగలను అధికారికంగా నిర్వహిస్తూ వాటి ప్రాధాన్యతను పెంచిన ఘనత కేసీఆర్‌దేనన్నారు.
అన్ని మతాల ఆశీర్వాదాలు తెలంగాణ ప్రజలపై ఉండి సమాజం మరింత అభివృద్ది పథంలో నడవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమాల్లో మున్సిపల్ చైర్ పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ, బీఆర్‌ఎస్ కార్యదర్శి వై.వెంకటేశ్వర్లు, మాజీ జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్‌గౌడ్, జడ్పీ మాజీ వైస్ చైర్మన్ గోపగాని వెంకటనారాయణ గౌడ్, నాయకులు నంధ్యాల దయాకర్‌రెడ్డి, ఉప్పల ఆనంద్, మారిపెద్ది శ్రీనివాస్‌గౌడ్, నెమ్మాది బిక్షం జీడీ బిక్షం తదితరులు పాల్గొన్నారు.