13-03-2025 02:38:27 PM
హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Chief Minister Revanth Reddy) నిన్న సీఎల్పీ మీటింగ్(CLP meeting)లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలను రెచ్చగొట్టారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్(MLA Talasani Srinivas Yadav) పేర్కొన్నారు. అందుకే జగదీశ్ రెడ్డి ప్రసంగానికి అడుగడుగునా ఆటంకాలు కల్పించారని తెలిపారు. జగదీశ్ రెడ్డి ప్రసంగం మొదలైందో లేదో కాంగ్రెస్ సభ్యులు అల్లరి మొదలు పెట్టారని తలసాని ఆరోపించారు. జగదీశ్ రెడ్డి(Jagadish Reddy) స్పీకర్ ను ఎక్కడా అవమానపరచ లేదన్న తలసాని, స్పీకర్ ను స్పీకర్ గా గౌరవిస్తున్నామని స్పష్టం చేశారు. ఈ సభ అందరిది అని జగదీశ్ రెడ్డి అంటే తప్పేమిటి? ఆయన్ని సస్పెండ్ చేయాలని దురుద్దేశ పూరితంగా కాంగ్రెస్ సభా పక్షం ప్రయత్నిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికార పక్షమే సభా సంప్రదాయాలు మంట గలిపి, ఆ నెపాన్ని మాపై నెడితే సహించేది లేదని తలసాని శ్రీనివాస్ యాదవ్ హెచ్చరించారు.