calender_icon.png 16 March, 2025 | 5:17 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తుర్కయంజల్‌లో ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం

16-03-2025 01:14:57 PM

ఇబ్రహీంపట్నం,(విజయక్రాంతి): శాసన సభాదిపతి గడ్డం ప్రసాద్ రావుపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్వర్ రెడ్డి చేసిన అనుచిత వాక్యలను తీవ్రంగా ఖండిస్తూ తుర్కయంజల్ కూడలిలో జగదీశ్వర్ రెడ్డి దిష్టి బొమ్మను దహనం చేశారు. టీపీసీసీ పిలుపు మేరకు గురువారం తుర్కయంజల్ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు కొత్త కుర్మ మంగమ్మ, శివకుమార్ ఆధ్వర్యంలో దిష్టి బొమ్మ దహనం అనంతరం వారు మాట్లాడుతూ.. శాసనసభకు వెన్నుముక అయినట్టువంటి శాసన సభాదిపతి గడ్డం ప్రసాద్ రావు పై చేసిన అనుచిత వాక్యలు బీఆర్ఎస్ నాయకుల అహంకారానికి నిదర్శనం అన్నారు.

దళితజాతి కూడా అవమానిచ్చినట్టేనని, దళితులు అంటే బీఆర్ఎస్ పార్టీకి ఎప్పుడు చిన్నచూపేనని స్పీకర్ గడ్డం ప్రసాద్ రావుని అవమానించిన జగదీశ్వర్ రెడ్డి కి ప్రజలే తగిన గుణపాఠం చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయని అన్నారు. స్పీకర్ ప్రసాద్ రావుకి, దళిత జాతికి జగదీశ్వర్ రెడ్డి బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. లేనియెడల తీవ్రపరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో టిపీసీసీ కార్యదర్శి కొత్తకుర్మ శివకుమార్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కుంట గోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.