calender_icon.png 23 October, 2024 | 11:24 PM

ఆసుపత్రి నిర్మాణంపై ఎమ్మెల్యే అసహనం

02-09-2024 01:48:48 AM

నాణ్యతా పరీక్షలు నిర్వహించాలని అధికారులకు ఆదేశం

వనపర్తి, సెప్టెంబర్ 1 (విజయక్రాంతి): వనపర్తి జిల్లా కేంద్రంలో మాతాశిశు సంరక్షణ కేంద్రం వద్ద క్రిటికల్ కేర్ యూనిట్ కేంద్ర నిర్మాణాలను ఆదివారం ఎమ్మెల్యే మేఘారెడ్డి పరిశీలించారు. నిర్మాణాల్లో నాణ్యత లోపం, టీ నిర్వహణ, సిబ్బంది నిర్లక్ష్యంపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. వరదకు అడ్డంగా చేపట్టిన నిర్మాణాలు వాగు లెవల్ కంటే కిందకి ఉండడంతో వర్షపు నీరు పూర్తిగా క్రిటికల్ కేర్ సెంటర్‌లోకి వస్తుందని, వర్షపు నీరు రాకుండా తగు చర్యలను తీసుకోవాలని ఎమ్మెల్యే సంబంధిత అధికారులకు సూచించారు.

భవన నిర్మాణాల్లో క్వాలిటీ లేదని తెలిస్తే కఠిన చర్యలను తీసుకుంటామన్నారు. నాణ్యతపై తగు పరీక్షలు చేయించాలన్నారు. అనంతరం జిల్లావ్యాప్తంగా రోగులకు రక్త పరీక్షలు చేసేందుకు అధునాతనంగా ఏర్పాటు చేసిన టీహబ్ కేంద్రాన్ని ఎమ్మెల్యే పరిశీలించారు. ఇందులో మొత్తం 14 మంది సిబ్బంది ఉండాల్సి ఉండగా ఏ ఒక్కరు కూడా లేకపోవడంపై ఎమ్మెల్యే అసహనం వ్యక్తం చేశారు.