09-04-2025 02:24:28 AM
యాదాద్రి భువనగిరి, ఏప్రిల్ 8 (విజయక్రాంతి ): బీబీనగర్ మండలం రాయరావుపేట గ్రామ రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు ఆహ్వానిస్తూ స్థానిక ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డికి ఆహ్వాన పత్రికను ఆలయ కమిటీ చైర్మన్ ఉడుత నవీన్, గ్రామ పెద్దలు అందజేశారు.
ఆహ్వానించిన వారిలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు గోలి పింగల్ రెడ్డి, పిఎసిఎస్ చైర్మన్ మెట్టు శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ మన్నె బాలరాజు, ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు కొలకొండ జయప్రకాష్, తల్లం సురేష్, బుర్ర గంగయ్య, గంగాధరి శంకరయ్య, రంగోలి సత్యనారాయణ, రంగోలి వంశీ , రంగోలి సతీష్, నాశ బోయిన సాయి, రంగుల సత్యనారాయణ తదితరులు ఉన్నారు