కామారెడ్డి, నవంబర్ 23 (విజయక్రాంతి): కామారెడ్డి నియోజక వర్గంలోని దోమకొండ మండలం సీతారంపల్లిలో ఉన్న కస్తూర్భాగాంధీ బాలికల పాఠశాలను శనివారం కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి తనిఖీ చేశారు. విద్యార్థులను సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పాఠశాలకు బదిలీ అయిన ఎస్వో మంగమ్మను తొలగించాలని విద్యార్థులు శుక్రవారం పాఠశాల వద్ద ఆందోళన చేసిన విష యం విధితమే.
విద్యార్థులు ఎందు కు ఆందోళన చేయాల్సి వచ్చిందో అడిగి తెలుసుకున్నారు. ఏ సమస్య వచ్చినా తన దృష్టికి తెస్తే పరిష్కారిస్తానని ఎమ్మెల్యే విద్యార్థులకు హమీ ఇచ్చారు. ఆ తరావ్త డీఈవో రాజుతో ఎమ్మెల్యే మాట్లాడారు.