calender_icon.png 22 April, 2025 | 10:48 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే

21-04-2025 12:00:00 AM

బూర్గంపాడు,ఏప్రిల్20(విజయక్రాంతి): బూర్గంపాడు మండల కేంద్రంలోని మార్కె ట్ యార్డ్ లో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే పాయం వెంకటే శ్వర్లు ఆదివారం పరిశీలించారు. అనంతరం రైతులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

ధాన్యం కొనుగోలు కేంద్రం లో పాత బస్తాలు ఇస్తున్నారని దాని వల్ల ధాన్యం వృధా అవుతుందని రైతులు ఎమ్మె ల్యే దృష్టికి తీసుకువెళ్లగా వెంటనే స్పందించి సంబంధిత అధికారులతో చరవాణిలో మా ట్లాడి సమస్యను పరిష్కరించాలని సూచించారు. రైతులు ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.

సమస్యలు పరిష్కరిస్తామని రైతులకు భరోసానిచ్చారు. అనంతరం సారపాక సుందరయ్య నగర్ లో నూతన ఏసుప్రభు ప్రార్ధన మందిరానికి శంకుస్థాపన చేశారు. ఈస్టర్ పండుగ సందర్భంగా చర్చిలో స్థానిక క్రైస్తవులతో కలిసి ప్రార్థనలు చేసి కేక్ కట్ చేసి ఈస్టర్ శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు కృష్ణారెడ్డి,మాజీ ఉప సర్పం చ్ పోతిరెడ్డి వెంకటేశ్వర్ రెడ్డి,నాయకులు రోశిరెడ్డి, కైపు శ్రీనివాస్ రెడ్డి,బట్టా విజయ్ గాంధీ,భజన సతీష్, నాగరాజు,యువజన నాయకులు తదితరులు పాల్గొన్నారు.