calender_icon.png 24 February, 2025 | 3:48 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీఎం సభాస్థలిని పరిశీలించిన ఎమ్మెల్యే

24-02-2025 12:36:23 AM

మంచిర్యాల, ఫిబ్రవరి 23 (విజయక్రాంతి) : ఉమ్మడి ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్, కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 24న జిల్లాకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వస్తున్న నేపథ్యంలో సభాస్థలిని ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు ఆదివారం పరిశీలించారు.

నస్పూర్ కలెక్టరేట్ ముందు ఆవరణలో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళన సభకు సీఎం వస్తున్న నేపథ్యంలో భద్రత, కార్యక్రమానికి హాజరై వారికి ఇలాంటి ఇబ్బందులు కలగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సంబంధిత అధికారులతో మాట్లాడారు. ఎమ్మెల్యే వెంట మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు తదితరులు ఉన్నారు