calender_icon.png 10 January, 2025 | 11:13 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్పోర్ట్స్ స్కూల్‌ను తనిఖీ చేసిన ఎమ్మెల్యే

23-07-2024 01:04:40 AM

ఆదిలాబాద్, జూలై 22 (విజయక్రాంతి): ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత క్రీడా పాఠశాలను ఎమ్మెల్యే పాయల్ శంకర్ సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలోని విద్యార్థులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. విద్యార్థులకు అందించే భోజనాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. క్రీడా పాఠశాలలో సౌకర్యాలు, సిబ్బంది కొరతతో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. పూర్తిస్థాయిలో సిబ్బందిని నియమించకుండా డిప్యూటేషన్లపై నియమించ డం తగదని మండిపడ్డారు. ఈ విషయాన్ని ప్రిన్సిపల్ సెక్రెటరీ, ఎండీ దృష్టికి తీసుకెళ్తానని ఎమ్మెల్యే చెప్పారు. పాఠశాల సమస్యలను సీఎం, ప్రిన్సిపల్ సెక్రటరీ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి ఆయన చేస్తానన్నారు.