25-02-2025 12:33:37 AM
నారాయణఖేడ్, ఫిబ్రవరి 24: నారాయణఖేడ్ మున్సిపాలిటీ పరిధిలోని మంగల్ పేటలో ఉన్న బస్టాండ్ ను స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ సంజీవరెడ్డి సోమవారం అకస్మికంగా తనిఖీ చేశారు . ఈ సందర్భంగా ఆయన ఆర్టీసీ అధికారులతో మాట్లాడుతూ బస్టాండును పరిశుభ్రంగా ఉంచాలని, ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండాఅధికారులు చూసుకోవాలని, ప్రయాణికులకు తాకినీరు ఇతర వసతులు కల్పించాలని సూచించారు. ఆయన వెంట మున్సిపాలిటీ మాజీ వైస్ చైర్మన్ దారం శంకర్ సెట్ తదితరులు ఉన్నారు.