calender_icon.png 26 April, 2025 | 3:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహిళల టీ స్టాల్‌ని ప్రారంభించిన ఎమ్మెల్యే

25-04-2025 01:29:06 AM

కల్లూరు, ఏప్రిల్ 24 :-స్థానిక  ఎంపీడీఓ కార్యాలయం ప్రాంగణం లో  తెలంగాణ ప్రభుత్వం మహిళల కోసం ఏర్పాటు చేసిన ‘స్త్రీ టీ‘ షాపులను సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ గురువారం ప్రారంభించారు.ఇందిరా మహిళా శక్తి  పధకం కింద మండలంలోని డ్వాక్రా మహిళలకు 10 యూనిట్ లు మంజూరయ్యాయి.అందులో ప్రయోగాత్మకంగా రెండు యూనిట్ లు ప్రారంభించడం జరిగింది.అనంతరం పక్కనే నూతనంగా నిర్మిస్తున్న ప్రభుత్వ ఆసుపత్రి పనులు ఎమ్మెల్యే పరిశీలించారు.

నిర్మాణ పనులను ఇంజినీరింగ్ అధికారులతో అడిగి తెలుసుకున్నారు.నిర్మాణ పనుల్లో నాణ్యత ప్రమాణం ఖచ్చితంగా పాటించాలన్నారు అనుకున్న సమయంలో ప్రారంబోత్సవానికి సిద్ధం చెయ్యాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో కల్లూరు మార్కెట్ చైర్మన్ బాగం నీరజ ప్రభాకర్ చౌదరి,ఎంపీడీఓ చంద్రశేఖర్, ఎ.పి.యం రాంబాబు, సి సి, మండల కాంగ్రెస్ నాయకులు పసుమర్తి చందర్రావు,ఏనుగు సత్యం బాబు,బాగం ప్రభాకర్ చౌదరి, పెద్దబోయిన శ్రీనివాస్ రావు,ఆళ్లకుంట నరసింహారావు, భైర్ల కాంతారావు,కృష్ణా రెడ్డి,మట్టా రామకృష్ణ,పంతులు నాయక్,యాసా శ్రీకాంత్,నల్లగట్ల పుల్లయ్య, కీసర  మధుసూదన్ రెడ్డి,కీసర రవీందర్ రెడ్డి, మండల కాంగ్రెస్ నాయుకులు,గ్రామ నాయుకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.