calender_icon.png 10 February, 2025 | 8:09 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కల్యాణమండపాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

10-02-2025 01:50:28 AM

కామారెడ్డి , ఫిబ్రవరి ౯ (విజయ క్రాంతి) :  దోమకొండ మండల కేంద్రంలోని బుడగ జంగాల కాలనీలో ఎమ్మెల్యే సొంత నిధులతో నిర్మించిన కళ్యాణ మండపాన్ని ఆదివారం ప్రారంభించారు. బుడగ జంగాల సంఘ సభ్యుల విన్నపం మేరకు నిర్మించిన కళ్యాణ మండపాన్ని ఆయన చేతుల మీదుగానే ప్రారంభించినట్లు తెలిపారు.

కామారెడ్డి ఎమ్మెల్యే కు రుణపడి ఉంటామని బుడగ జంగాల సంఘం తరఫున ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో దోమకొండ బుడుగ జంగం సభ్యులతోపాటు బిజెపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.