calender_icon.png 25 February, 2025 | 7:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆదిత్య మెడికల్ అకాడమీని ప్రారంభించిన ఎమ్మెల్యే

25-02-2025 12:00:00 AM

మేడ్చల్, ఫిబ్రవరి 24(విజయ క్రాం తి): మేడ్చల్ జిల్లా ఈసీఐఎల్ వద్ద ఆది త్య మెడికల్ అకాడమీని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు ర్యాంకు సాధించడానికి మెడికల్ అకాడమీల పాత్ర ఎంతో కీలకంగా ఉంటుందన్నారు.

విద్యార్థులకు మంచి కోచింగ్ ఇచ్చి ఉజ్వల భవిష్యత్తుకు పునాదులు వేయాలన్నారు. విద్యార్థులు కష్టపడి చదివి తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలన్నారు. ఈ కార్యక్రమంలో మీర్పేట్ హౌసింగ్ బోర్డ్ కార్పొరేటర్ ప్రభుదాస్, భాను గౌడ్, హేమ, రాబిన్సన్, మహేష్ గౌడ్, నవీన్ గౌడ్, జంపాల రెడ్డి తదితరులు పాల్గొన్నారు.