calender_icon.png 8 January, 2025 | 8:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మన్మోహన్ సింగ్ భౌతికంగా లేకున్నా.. చేసిన సేవలు ఉంటాయి

30-12-2024 03:09:20 PM

హైదరాబాద్,(విజయక్రాంతి): తెలంగాణ శాసనసభ(తెలంగాణ శాసనసభ) ప్రత్యేక సమావేశాలు సోమవారం కొనసాగుతున్నాయి. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్(Manmohan Singh) మృతి పట్ల సంతాపం తెలుపుతూ సభ తీర్మానం చేసింది. సభలో బీఆర్ఎస్ మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు(MLA Harish Rao) మాట్లాడుతూ... మన్మోహన్ సింగ్ భౌతికంగా లేకున్నా.. దేశానికి ఆయన చేసిన సేవలు ఉంటాయన్నారు. విదేశాల్లోనూ మన్మోహన్ కు ఉన్నత ఉద్యోగాలు వచ్చినప్పటికీ వెళ్లకుండా దేశమే ముఖ్యమని చాటిన వ్యక్తి అని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. మన్మోహన్ ఎప్పుడూ పదవుల కోసం చూడలేదు కానీ, పదవులే ఆయనను వెతుకుంటూ వచ్చాయని హరీశ్ రావు చెప్పారు.

దేశ ఆర్థిక వ్యవస్థకు దశ, దిశ చూపిన వ్యక్తి అని, పీవీ నరసింహా రావు(PV Narasimha Rao) నమ్మకాన్ని మన్మోహన్ సింగ్ వమ్ము చేయలేదని ఆయన వ్యాఖ్యానించారు. లైసెన్స్, పర్మిషన్, కోటారాజ్ విధానాలకు ఆయన స్వస్తి పలికారని, కానీ దేశ ప్రధానిగా పదేళ్లు పదవీలో ఉన్నప్పటికీ ఒక్క ఆరోపణ కూడా రాని మన్మోహన్ సింగ్ జీవితం దేశ సేవలో ధన్యమైందని మాజీ మంత్రి హరీశ్ రావు హర్షం వ్యక్తం చేశారు. పీవీ నరసింహా రావుకి భారత రత్న(Bharat Ratna) ఇవ్వాలని ఆనాడు సభా నాయకుడిగా కేసీఆర్ తీర్మానం చేస్తే, శాసనసభ్యులందరం ఏకగ్రీవంగా సమ్మతి తెలిపామన్నారు. దీంతో ఈ మధ్య కాలంలో పీవీకి భారత రత్న పురస్కారం ఇచ్చారని గుర్తు చేశారు. అలాగే స్వర్గీయ మన్మోహన్‌ సింగ్‌ కి కూడా భారత రత్న ఇవ్వాలని ఈ సందర్భంగా హరీశ్ రావు కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు తెలిపారు.