సాగర్ నిండుకుండలా ఉన్నా.. పంటపొలాలు ఎండిపోతున్నాయి
పోయిన ఏడాది ప్రకృతి కరువు తెస్తే.. ఇప్పుడు కాంగ్రెస్ కరువు తెచ్చింది
హైదరాబాద్: కృష్ణా నది పరవళ్లు తొక్కుతున్న, అసమర్థ కాంగ్రెస్ పాలనలో ఖమ్మం జిల్లా రైతులు సాగు నీటి కోసం ఎదురు చూసే పరిస్థితి ఏర్పడిందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు మండిపడ్డారు. ఖమ్మం జిల్లాలో పంటపొలాలు ఎండిపోతున్నాయని హరీశ్ రావు ద్వజమెత్తారు. పాలేరు జలశయానికి 100 మీటర్ల దిగువన కాలువకు గండి పడిందన్నారు. సెప్టెంబర్ 1న కాలువకు గండి పడింది.. 22 రోజులు అయినా కాలువకు పడ్డ గండి పూడ్చడం చేతకాక, రైతుల పొలాలను రేవంత్ సర్కార్ ఎండపెడుతున్నదని హరీశ్ రావు మండిపడ్డారు. సాగర్ నిండుకుండలా ఉన్నా రైతుల పంటలు ఎండుతున్నాయని ప్రశ్నించారు. పోయిన ఏడాది ప్రకృతి కరువు తెస్తే.. ఇప్పుడు కాంగ్రెస్ కరువు తెచ్చిందన్నారు.