02-03-2025 04:52:12 PM
హైదరాబాద్,(విజయక్రాంతి): ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ మాజీ, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు ఆదివారం బహిరంగ లేఖ రాశారు. సన్ ఫ్లవర్ రైతుల కష్టాలు ముఖ్యమంత్రికి పట్టవా..?, సన్ ఫ్లవర్ కొనుగోలు కేంద్రాలను ఎప్పడు ప్రారంభిస్తారని హరీశ్ రావు ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం దళారులకు తక్కువ ధరకే విక్రయించాల్సిన దుస్థితి రైతులకు తెచ్చిందని, క్వింటాకు రూ.వెయ్యికి పైగానే నష్టాన్ని రైతులకు కలిగిస్తున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ పాలనలో నూనె పంటలకు ప్రోత్సాహం.. కాంగ్రెస్ పాలనలో తిరోగమనం అని ఎద్దేవా చేశారు. ఎన్నికల కోడ్ తో సంబంధం లేకుండా సన్ ఫ్లవర్ కొనుగోలు కేంద్రాలు తెరవాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు.