calender_icon.png 18 April, 2025 | 4:48 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తెలంగాణను కేసీఆర్ నిలబెట్టారు.. రేవంత్ రెడ్డి పడగొట్టారు: హరీశ్ రావు

09-04-2025 03:19:04 PM

సంగారెడ్డి,(విజయక్రాంతి): బీఆర్ఎస్ మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు సంగారెడ్డి జిల్లాలో పర్యటించారు. గణేష్ గడ్డ ఆలయంలోని సిద్ధి వినాయకుడిని దర్శించుకొని, ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ... బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తెలంగాణను నిలబెడితే.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పడగొట్టారని ఆరోపించారు. బీసీ సభకు రాహుల్ గాంధీ ఢిల్లీలో ఉండి కూడా వెళ్లలేదని, విద్యార్థులపై పెట్టిన కేసులను డిప్యూటీ సీఎం ఉపసంహరించుకున్నారన్నారు. దీంతో రేవంత్ రెడ్డి తప్పుడు కేసులు పెట్టారని భట్టి విక్రమార్క చెప్పినట్లే కదా..? అని ప్రశ్నించారు. అక్రమ కేసులు పెట్టినందుకు రేవంత్ రెడ్డి విద్యార్థులకు క్షమాపణలు చెప్పాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు. రాష్ఱంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అరాచక పాలనను తట్టుకోలేక తెలంగాణ ప్రజలంతా కేసీఆర్ వైపు చూస్తున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్ ఏడాది పాలనలో ప్రజలకు అన్ని అర్థమయ్యాయని, ఎన్నికల ముందు చేసిన ఆరు గ్యారంటీలను అమలు చేయడంలో ప్రభుత్వం విపలమైందని, ఆరు గ్యారంటీ ఒకటైన రైతు రుణమాఫీని 50 శాతం కూడా చేయలేదని విమర్శించారు.

రైతుబంధు, రూ.4 వేల పింఛన్, మహాలక్ష్మి పింఛన్ రాలేదన్నారు. తెలంగాణ రాష్ట్ర జీఎస్టీ ఆదాయం పూర్తిగా తగ్గిపోయిందని,  కేసీఆర్ ఉన్నప్పుడు ప్రతి సంవత్సరం 12 శాతం జీఎస్టీ వృద్ధిరేటు ఉండేదని గుర్తు చేశారు. దేశ జీఎస్టీ కంటే సగానికి తెలంగాణ జీఎస్టీ వృద్ధిరేటు పడిపోయిందని,  దేశం 10 శాతం జీఎస్టీ వృద్ధిరేటు సాధిస్తే తెలంగాణ కేవలం 5% మాత్రమే వృద్ధిరేటు సాధించిందని ఎద్దేవా చేశారు. కేసీఆర్ తెలంగాణను నిలబెడితే.. ఏడాదిన్నరలో రేవంత్ పడగొట్టిండని హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.  హైడ్రా పేరుతో రేవంత్ రెడ్డి పేదల ఇళ్లను కూలగొట్టిందన్నారు. బీఆర్ఎస్ కోసం కష్టపడ్డ ప్రతి కార్యకర్తను పార్టీ కపాడుకుంటుందోన్ని హరీశ్ రావు హామీ ఇచ్చారు.