calender_icon.png 25 February, 2025 | 3:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే గూడెం

25-02-2025 12:21:32 AM

పటాన్చెరు, ఫిబ్రవరి 24 : తిరుమల వేంకటేశ్వర స్వామిని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి  సోమవారం ఉదయం కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. అనంతరం తన సోదరుడు గూడెం మధుసూదన్ రెడ్డి కుమారుడు గూడెం సంతోష్ రెడ్డి వివాహం సందర్భంగా స్వామి వారి ఆలయంలో తొలి వివాహ పత్రికను అందించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. తిరుపతి వెంకన్న ఆశీస్సులతో పటాన్చెరు నియోజకవర్గ ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. ఎమ్మెల్యే ఆయన సోదరుడు గూడెం మధుసూదన్ రెడ్డి, మాజీ ఎంపీపీ యాదగిరి యాదవ్, మాజీ ఎంపీటీసీ కొల్కురి రామచంద్రా రెడ్డి, గూడెం సందీప్ రెడ్డి, తదితరులు  ఉన్నారు.