15-02-2025 11:46:28 PM
పటాన్‌చెరు,(విజయక్రాంతి): పటాన్‌చెరు నియోజకవర్గం వ్యాప్తంగా సంత్ సద్గురు సేవాలాల్ మహారాజ్ జయంతి(Sant Sadguru Sevalal Maharaj Jayanti) వేడుకులు శనివారం ఘనంగా నిర్వహించారు. పటాన్‌చెరులో ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి(MLA Gudem Mahipal Reddy) ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళ్లు అర్పించారు. చిట్కుల్‌లో మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ కంటెస్టేడ్ క్యాండిడేట్ నీలం మధు ముదిరాజ్(Neelam Madhu Mudiraj) చిత్రపటానికి నివాళ్లు అర్పించారు. జిన్నారం గిరిజన గురుకుల పాఠశాలలో చిత్రపటానికి ఉపాధ్యాయులు, విద్యార్థులు నివాళ్లు అర్పించారు. ఈ సందర్భంగా సేవాలాల్ మహారాజ్ భోదనలు ప్రతి ఒక్కరికీ అనుసరణీయమని ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో అమీన్‌పూర్ మాజీ జడ్పీటీసీ సుధాకర్‌రెడ్డి, రామచంద్రాపురం ఎంఈవో రాథోడ్, పటాన్‌చెరు ఎంఈవో నాగేశ్వర్‌నాయక్, జీహెచ్‌ఎంసీ డిప్యూటీ కమిషనర్ సురేశ్ తదితరులు పాల్గొన్నారు.