calender_icon.png 24 January, 2025 | 5:06 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విలీన గ్రామాల అభివృద్ధికి కృషి

24-01-2025 01:02:33 PM

ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి 

రూ. 2.38 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన 

నూతన రిజర్వాయర్ నుంచి మంచినీటి సరఫరా ప్రారంభం 

పటాన్ చెరు,(విజయక్రాంతి): అమీన్ పూర్ మున్సిపాలిటీ(Ameenpur Municipality)లో విలీనమైన గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు నియోజకవర్గం అమీన్ పూర్ మున్సిపల్ పరిధిలోని కిష్టారెడ్డిపేట, పటేల్ గూడ, సుల్తాన్ పూర్, ఐలాపూర్, ఐలాపూర్ తాండ, దయారా పరిధిలో రూ .2.38 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే  శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం పటేల్ గూడ పరిధిలో నిర్మించిన రిజర్వాయర్ నుంచి మంచి నీటి సరఫరాను ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశాల్లో ఎమ్మెల్యే మాట్లాడుతూ అమీన్ పూర్ మున్సిపల్ పరిధిలో విలీనమైన గ్రామాల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక ద్వారా  నిధులు కేటాయిస్తున్నామని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందిస్తున్నామని తెలిపారు. పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరిని అభివృద్ధిలో భాగస్వాములను చేస్తున్నామని తెలిపారు.  విలీన గ్రామాల పరిధిలో ఏర్పాటు అవుతున్న కాలనీలలో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తున్నామని తెలిపారు.  ఈ కార్యక్రమాల్లో మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి, వైస్ చైర్మన్ నరసింహా గౌడ్, మాజీ ఎంపీపీ దేవానందం, మాజీ జడ్పీటీసీ సుధాకర్ రెడ్డి, జలమండలి జీఎం సుబ్బారాయుడు, మున్సిపల్ కమిషనర్ జ్యోతి రెడ్డి, తాజా మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.