28-03-2025 11:30:10 PM
పటాన్ చెరు,(విజయక్రాంతి): పటాన్ చెరు డివిజన్ పరిధిలోని పంచముఖి హనుమాన్ దేవాలయం నుంచి ఆల్విన్ కాలనీ వరకు రూ.12 లక్షల అంచనా వ్యయంతో ఏర్పాటు చేసిన వీధి దీపాలను ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి శుక్రవారం రాత్రి ప్రారంభించారు. అనంతరం రూ.30 లక్షల అంచనా వ్యయంతో సింఫనీ కాలనీ నుంచి చిన్న వాగు వరకు నాలా పూడికతీత పనులను ప్రారంభించారు. అనంతరం బృందావన్ కాలనీలో ఇంటింటికి మంచినీటి సరఫరాను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పటాన్ చెరు కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, మాజీ ఎంపీపీ యాదగిరి యాదవ్, ఆయా కాలనీల ప్రతినిధులు, ప్రజలు పాల్గొన్నారు.