24-03-2025 12:15:45 PM
పటాన్ చెరు: అమీన్ పూర్ మున్సిపల్ పరిధిలోని వందనాపురి కాలనీలో గల శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవాలయం ముఖద్వారాన్ని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సోమవారం ప్రారంభించారు. అనంతరం ఆలయ వార్షికోత్సవ పూజా కార్యక్రమాలలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. సొంత నిధులతో ఆలయ ముఖద్వారం నిర్మించడం సంతోషంగా ఉందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ నర్సింహా గౌడ్, సీనియర్ నాయకులు రమేష్ గౌడ్, ప్రమోద్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.