calender_icon.png 13 March, 2025 | 4:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎల్ఓసీ చెక్కు అందజేసిన ఎమ్మెల్యే జీఎస్సార్*

13-03-2025 12:20:14 AM

చిట్యాల,(విజయక్రాంతి): భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం తిరుమలాపూర్ గ్రామానికి చెందిన గోపగాని వెంకటేష్ రోడ్డు ప్రమాదంలో గాయపడి హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కాగా విషయాన్ని స్థానిక కాంగ్రెస్ శ్రేణులు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు దృష్టికి తీసుకువెళ్ళారు. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే నిమ్స్ ఆసుపత్రి,సెక్రటేరియట్ అధికారులతో మాట్లాడారు. గంటల వ్యవధిలోనే ప్రభుత్వం నుండి రూ.1,30,000ల విలువైన చెక్కును మంజూరు చేయించి, బాధిత కుటుంబ సభ్యులకు బుధవారం సాయంత్రం సెక్రటేరియట్ లో అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పేద, నిరుపేద కుటుంబాలకు నాణ్యమైన వైద్య సాయం అందించేందుకు ఎల్వోసీ ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ప్రజా ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమం కోసమే పనిచేస్తుందని ఎమ్మెల్యే అన్నారు.