06-03-2025 11:17:37 PM
ఇన్ని రోజులకు గుర్తొచ్చాన..
డంపింగ్ యార్డ్ విషయంలో కలిసిన గుమ్మడిదల ప్రజలతో ఎమ్మెల్యే గూడెం..
పటాన్ చెరు: డంపింగ్ యార్డ్ కు వ్యతిరేకంగా జేఏసీ ఏర్పాటు చేసుకొని నెల రోజులుగా నిరసనలు, రిలే దీక్షలు చేస్తూ లోకల్ ఎమ్మెల్యేకు చెప్పరా.... ఇన్నాళ్లకు నేను గుర్తొచ్చానా అంటూ పటాన్చెరు క్యాంప్ కార్యాలయంలో గురువారం తనను కలిసిన గుమ్మడిదల ప్రజలపై ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఒక్కింత ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరు అధికార పార్టీలో ఉన్నారని డంపింగ్ యార్డ్ కు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటం విషయంలో మిమ్మల్ని కలిసేందుకు వెనుకాడమని వారు చెప్పగా.. తాను ప్రతిపక్షంలో ఉన్నానని ఎమ్మెల్యే అన్న మాటల వీడియోలు ప్రస్తుతం పటాన్ చెరు నియోజకవర్గంలోని వాట్సప్ గ్రూపుల్లో చక్కర్లు కొడుతున్నాయి. మరోపక్క మహిపాల్ రెడ్డి పార్టీ మారుతాడని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఇటీవలే ముఖ్య అనుచరులతో పార్టీ మారే విషయమై ఎమ్మెల్యే చర్చించినట్లు విశ్వసనీయ సమాచారం.