10-03-2025 01:36:08 AM
దేవరకద్ర, మార్చి 9 : ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్న ఎమ్మెల్యే జిఎంఆర్ సేవలు మరు వలేనివని కాంగ్రెస్ పార్టీ కౌకుంట్ల మండల అధ్యక్షులు రాఘవేందర్ రెడ్డి అన్నారు. ఆదివారం ఇస్రంపల్లి గ్రామం లో మంజూరైన సీసీ రోడ్ల పనులను కౌకుంట్ల మండల పార్టీ అధ్యక్షులు మాది రెడ్డి రాఘవేందర్ రెడ్డి ప్రారంభించారు.
ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ రహదారులతోనే గ్రామాలు అభివృద్ధి చెందుతాయని భావిం చి మునుపెన్నడూ లేని విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామాలకు సైతం సీసీ రోడ్లు మంజూరు చేస్తున్నారని తెలిపారు.
అ గ్రా మాలు అభివృద్ధి జరగాలంటే కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాధ్యం అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు గొల్ల కృష్ణయ్య , ఎండి సలాం, వాకిటి కృష్ణయ్య, కావాలి రాజు, తిరుపతయ్య, గొల్ల వెంకట్ రాములు, కుర్వ తదితరులు పాల్గొన్నారు.