కరీంనగర్: కరీంనగర్ లోని రేకుర్తి గుట్ట మీద గల శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి నిర్మాణ పనులను ఇంజనీరింగ్ అధికారులతో కలిసి మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ యాదగిరి సునీల్ రావు, కార్పొరేటర్లు ఎదుల్ల రాజశేఖర్, సుధాగోమని మాధవి కృష్ణ కుమార్ గౌడ్ , నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు