calender_icon.png 17 March, 2025 | 5:36 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విదేశీ విద్యా పథకం కింద ప్రభుత్వం ఇచ్చింది గుండు సున్నా

17-03-2025 11:59:07 AM

హైదరాబాద్: విదేశీ విద్యా పథకం కింద ఎంపికైన విద్యార్థుల సంఖ్య 1913 అన్నారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్(BRS MLA Gangula Kamalakar) తెలిపారు. గతంలో కేవలం బీసీల్లోనే 2,230 మంది పథకం కింద ఎంపిక చేశారని చెప్పారు. విద్యా పథకం కింద ఎంపికైన విద్యార్థుల సంఖ్య ఎంతో స్పష్టంగా చెప్పాలని గంగుల డిమాండ్ చేశారు. 2016లో కేసీఆర్ హయాంలో విదేశీ విద్యా పథకం అమలు చేశారని ఆయన వెల్లడించారు. గతంలో ఏటా 300 మంది విద్యార్థులను పథకం కింద ఎంపిక చేశారని గంగుల వివరించారు.

ప్రస్తుత ప్రభుత్వం బీసీలు, మైనార్టీలు, ఎస్టీలకు పథకం కింద ఇచ్చింది గుండు సున్నా అని గంగుల(Gangula Kamalakar) ఎద్దేవా చేశారు. జనవరిలో కేవలం 105 మంది ఎస్సీలను పథకం కింద ఎంపిక చేశారని ఆయన లెక్క చెప్పారు. గతంలో 1,050 మంది ఎస్సీ, ఎస్టీ విద్యార్థులను విదేశాలకు పంపారని పేర్కొన్నారు. గతంలో రూ. 439 కోట్లతో 2,751 మంది మైనార్టీలకు,  2,123 మంది బీసీ విద్యార్థులకు, 780 బ్రాహ్మణ విద్యార్థులకు విదేశీ విద్య అందించారని తెలిపారు. గతంలో పేద వర్గాలకు చెందిన 6700 మందికి విదేశీ విద్యా పథకం అమలు చేసినట్లు పేర్కొన్నారు. విదేశీ విద్యా పథకం బకాయిలు వెంటనే చెల్లించాలని గంగుల కమలాకర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఐఐటీల్లో చదివే విద్యార్థులకు గతంలో రూ. 2 లక్షలు అందేవి, ఐఐటీల్లో చదివే పేద విద్యార్థులకు ఆర్థికసాయం అందట్లేదని గంగుల మండిపడ్డారు.