calender_icon.png 4 April, 2025 | 6:41 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చలివేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే గంగుల

02-04-2025 12:48:10 AM

కరీంనగర్ క్రైమ్, ఏప్రిల్ 1 (విజయ క్రాంతి): కరీంనగర్ పట్టణం లోని కమాన్ ప్రాంతంలో గల విశ్వబ్రాహ్మణ అఫీషియల్ మరియు ప్రొఫెషనల్ (వోపా)  ఆధ్వర్యంలో  వారి కార్యాలయం ఆవరణలో  ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని  మంగళవారం కరీంనగర్ శాసనసభ్యులు గంగుల కమలాకర్  నగర బి ఆర్ ఎస్ అధ్యక్షులు చల్ల హరిశంకర్, మరియు వోపా సభ్యులతో కలిసి చలివేంద్రాన్ని ప్రారంభించారు.

వేసవిలో  బాటసారులకు దాహార్తి  తీర్చేందుకు చలివేంద్రాన్ని ఏర్పాటు చేసిన ఓపా సభ్యులను ఎమ్మెల్యే అభినందించారు. కార్యక్రమానంతరం ఓపా డైరీని, క్యాలెండర్ ను  ఆవిష్కరించారు. ఈ సందర్భంగా  సంఘ సభ్యులు ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించారు.  ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు దిండిగాల మహేష్ జంగిలి సాగర్, వోపా రాష్ట్ర కన్వీనర్ వేములవాడ ద్రోణాచారి, గౌరవ అధ్యక్షులు కట్ట విష్ణువర్ధన్, జిల్లా అధ్యక్షులు గద్దె సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి గాలిపెల్లి శంకరయ్య, మాజీ అర్బన్ బ్యాంకు డైరెక్టర్ కర్ర సూర్య శేఖర్, మాజీ సూడా డైరెక్టర్ నేతి రవివర్మ,  సంఘం బాధ్యులు, తదితరులు పాల్గొన్నారు.