02-04-2025 12:41:59 AM
కరీంనగర్, ఏప్రిల్ 1 (విజయ క్రాంతి): నగరంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కరీంనగర్ నియోజకవర్గానికి చెందిన 136 మంది లబ్ధిదారులకు సుమారు 33 లక్షల 29,500 విలువ గల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను మాజీమంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టిఆర్‌ఎస్ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్, మాజీ కార్పొరేటర్లు, నాయకులు పాల్గొన్నారు.