calender_icon.png 3 April, 2025 | 10:12 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విజయదుర్గా భవాని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే గాంధీ

03-04-2025 12:26:57 AM

శేరిలింగంపల్లి, ఏప్రిల్ 2 (విజయక్రాంతి):శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని ఆదర్శ్ నగర్ కాలనీలో గల శ్రీ శ్రీ శ్రీ  విజయదుర్గా భవాని అమ్మవారి వార్షిక బోనాల మహోత్సవం  కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసి,అన్నదానం కార్యక్రమంలో పాల్గొని భక్తులకు అన్న ప్రసాదాలు వడ్డించిన పిఎసి చైర్మన్ ఆరెకపూడి గాంధీ.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...ప్రజలంతా ఆయురారోగ్యాలతో జీవించాలని అమ్మవారిని వేడుకున్నట్లు చెప్పారు. అమ్మవారి కరుణ  నియోజకవర్గంలోనీ ప్రజలపై ఉండాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో నాయకులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్,చింతకింది రవీందర్ గౌడ్, పద్మారావు,మల్లేష్ గౌడ్,మల్లేష్ యాదవ్, శ్రీకాంత్ రెడ్డి,అశోక్,సత్తి కుమార్,శ్రీనివాస్, గోపాల్,కర్ణ భక్తులు తదితరులు పాల్గొన్నారు.