03-04-2025 12:31:37 AM
శేరిలింగంపల్లి, ఏప్రిల్ 2 (విజయక్రాంతి):తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నూతనంగా చేపట్టిన సన్నబియ్యం పథకంలో భాగంగా చందానగర్ డివిజన్ పరిధిలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ మున్సిపల్ కల్యాణ మండపంలో పేదవారికి ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా సన్నబియ్యం అందజేసే కార్యక్రమాన్ని రంగారెడ్డి జిల్లా అడిషనల్ కలెక్టర్ ప్రతిమ సింగ్, ఎంబీసీ చైర్మన్ జేరిపేటి జైపాల్,కార్పొరేటర్లు మంజుల రఘునాథ్ రెడ్డి,దొడ్ల వెంకటేష్ గౌడ్,ఉప్పలపాటి శ్రీకాంత్, నార్నె శ్రీనివాసరావు, డీఎస్‌ఓ శ్రీనివాస్, ఏఎస్‌ఓ పుల్లయ్య,డీఏమ్ గోపి కృష్ణతో కలిసి ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించిన పిఏసి చైర్మన్ ఆరెకపూడి గాంధీ.
ఈ సందర్భంగా పీఏసీ చైర్మన్ గాంధీ మాట్లాడుతూ...ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి తీసుకున్న చరిత్రాత్మక నిర్ణయంతో ప్రతి పేదవారికి పట్టెడన్నం పెట్టాలన్న ఆలోచనతో సన్నబియ్యం పథకాన్ని ప్రారంభించ డం, నిరుపేదల కడుపు నింపడమే ప్రభుత్వ ధ్యేయంఅని, ఆకలితో అలవటించే పేదవాడికి సన్న బియ్యం అందించడం ద్వారా ఎంతో పుణ్యం కలుగుతుంది అని, రాష్ట్రంలోని 3 కోట్ల 10 లక్షల మందికి ఆరుకిలోల సన్నబియ్యం అందజేస్తున్నామని తెలిపారు.
ఈ కార్యక్రమానికి కోట్ల రూపాయలు ఖర్చయినా ప్రభుత్వం భరిస్తుంది. ఇది చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయే పథకంఅని ,ఇది పేదవారి గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోవాలన్న సంకల్పంతో ఈ పథకాన్ని ప్రారంభించమని తెలియచేశారు.తెలంగాణ ప్రభుత్వం రేషన్ దుకాణం ద్వారా పంపిణీ చేస్తున్న ఫోర్టీ ఫైడ్ బియ్యంలో ఐరన్ ,విటమిన్ బీ12,ఫోలిక్ ఆసిడ్ లు పుష్కలంగా ఉంటాయి. ఇవి స్త్రీలకు, గర్భిణీలకు,పిల్లలకు అందరికి ఆరోగ్యపరంగా మంచి పోషకాలు లభిస్తాయి.
అర్హులైన నిజమైన లబ్ధిదారులకు ఈ సువర్ణ అవకాశాన్ని వినియో గించుకోవాలని కోరారు. ఇప్పటికే శేరిలింగంపల్లి నియోజకవర్గ అభివృద్ధికి కొరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 16,600 కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేయడం,మరో 1000 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి చేతుల మీదుగా చందానగర్ ఫ్లై ఓవర్ ను త్వరలోనే ప్రారంభించుకుంటామని తెలియచేసారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు, మాజీ కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు కాలనీ వాసులు,లబ్ధిదారులు పాల్గొన్నారు.