బెల్లంపల్లి,(విజయక్రాంతి): బెల్లంపల్లి పట్టణంలోని బాలుర సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ (సీఓఈ)ని మంగళవారం బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ సందర్శించారు. తరగతి గదులను పరిశీలించి ఇక్కడ అందుతున్న వసతుల గురించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు వండుతున్న మధ్యాహ్న భోజనాన్ని విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనాన్ని అందించాలని ఉపాధ్యాయులకు సూచించారు. కళాశాలలో మైదానాన్ని మట్టి పోయించి చదును చేయించాలని సింగరేణి జిఎం దేవేందర్ ను ఫోన్ లో ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.