25-03-2025 04:29:56 PM
బెల్లంపల్లి కాంగ్రెస్ నాయకులు చిప్ప మనోహర్..
బెల్లంపల్లి (విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే గడ్డం వినోద్ కు రాష్ట్రమంత్రి వర్గంలో చోటు కల్పించి మంత్రి పదవి కేటాయించాలని ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లను కాంగ్రెస్ సీనియర్ నాయకులు చిప్ప మనోహర్ మంగళవారం కోరారు. గతంలో ఆయన రాష్ట్రమంత్రిగా పనిచేసిన అనుభవంతో పాటు ఎంతో రాజకీయ అనుభవం ఉన్న ఆయనకు మంత్రి పదవి ఇచ్చినట్లయితే జిల్లాతో పాటు రాష్ట్రంలోని అన్ని వెనుకబడిన ప్రాంతాలు కూడా అభివృద్ధి పథంలో ముందుకు సాగుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతే ధ్యేయంగా పనిచేస్తున్న ఆయనకు మంత్రివర్గంలో చోటు కల్పించినట్లయితే అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉంటు రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తారని ఆయన ఆకాంక్షించారు.
ఎలాంటి లాభాపేక్షలేకుండా నిస్వార్థంగా ప్రజాసేవకే అంకితమై బెల్లంపల్లి ఎమ్మెల్యేగా ప్రజాసేవ చేస్తూ, ఎన్ని కష్టనష్టాలు ఎదురైనప్పటికీ కాంగ్రెస్ పార్టీని నియోజకవర్గంలో బలోపేతం చేస్తున్నారని అన్నారు. పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల్లోను ఘననియమైన మెజార్టీ తీసుకువచ్చి కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి నిరంతరం కృషి చేశారని తెలిపారు. ఆయన అకుంటిత దీక్షతో పార్టీ బలోపేతానికి, అభివృద్ధికి కృషి చేస్తు, ప్రజలకు చేస్తున్న సేవలను పరిగణలోకి తీసుకొని, రాష్ట్ర ప్రజలకు కూడా సేవ చేసేందుకు అదిష్టానం ఆయనకు మంత్రి పదవి కేటాయించాలని ఆయన కోరారు. ముఖ్యంగా వివాదాలకు దూరంగా ఉండే ఆయన నియోజకవర్గంలో అన్ని వర్గాల నాయకులను, కార్యకర్తలను ఒకే తాటిపై నడిపిస్తు నియోజకవర్గాన్ని అన్నివిధాల అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళున్నారని పేర్కొన్నారు. ఆయన హయాంలో నియోజకవర్గంతో పాటు రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలు కూడా సుఖశాంతులతో కొనసాగుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ విషయమై పార్టీ అధిష్టాన నాయకులు ఆ దిశగా ఆలోచించి జిల్లాకు న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు.