23-03-2025 02:04:41 PM
బెల్లంపల్లి,(విజయక్రాంతి): బెల్లంపల్లి నియోజకవర్గంలోని వేమనపల్లి మండలంలో రూ 1.93 లక్షల అంచనా వ్యయంతో చామనపల్లి- కుష్ణపల్లి గ్రామాల మధ్యలో చేపట్టనున్న హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణ పనులను ఆదివారం బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ లాంచనంగా ప్రారంభించారు. ప్రభుత్వం పల్లెల్లో రవాణా సౌకర్యాన్ని మరింతగా మెరుగుపరిచేందుకు దశలవారీగా నిధులను విడుదల చేస్తుందని చెప్పారు. ప్రజా సంక్షేమానికి నిరంతరం సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని చెప్పారు. అనంతరం వేమనపల్లి మండలంలో అర్హులైన లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను ఎమ్మెల్యే గడ్డం వినోద్ అందజేశారు. ప్రభుత్వం అందిస్తున్న పథకాలను నిరుపేదలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో వేమనపల్లి మాజీ జెడ్పిటిసి రుద్రభట్ల సంతోష్, మండల పార్టీ అధ్యక్షులు సయ్యద్ సాబీర్ అలీ తోపాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు.