బెల్లంపల్లి,(విజయక్రాంతి): కన్నేపల్లి మండలంలోని పలు గ్రామాల్లో మంగళవారం ఎమ్మెల్యే గడ్డం వినోద్ అభివృద్ధి పనులకు భూమి పూజ చేశారు. మండలంలోని జనకాపూర్ గ్రామంలో రూ.3.50 లక్షల ఎన్ఆర్ఈజీఈఎస్ నిధులతో చేపట్టనున్న సిమెంట్ రోడ్డు పనులు, సీసీ డ్రైన్ పనులను కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. అనంతరం టేకులపల్లి గ్రామంలో రూ.20 లక్షల ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో చేపట్టనున్న నూతన గ్రామపంచాయతీ భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.
కన్నేపల్లి మండల కేంద్రంలో రూ.12 లక్షల ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో అంగన్వాడి భవన నిర్మాణ పనులకు భూమి పూజ చేశారు. వీగాం గ్రామంలో రూ 5 లక్షల నిధులతో సీసీ డ్రైన్ పనులను ప్రారంభించారు. అనంతరం కన్నేపల్లి రైతు వేదిక భవనంలో లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను ఎమ్మెల్యే గడ్డం వినో ద్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి ఆర్డీవో హరికృష్ణ,బెల్లంపల్లి మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఎం.వి. నర్సింగ్ రావు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు రంగారావు, మండల కాంగ్రెస్ అధ్యక్షులు పప్పుల రామాంజనేయులు తో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు , అధికారులు పాల్గొన్నారు.