calender_icon.png 22 January, 2025 | 7:27 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కంటి చికిత్స కార్యక్రమాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే

22-01-2025 04:17:10 PM

బెల్లంపల్లి,(విజయక్రాంతి): బెల్లంపల్లి పట్టణంలోని వంద పడకల ఆసుపత్రిలో బుధవారం కంటి చికిత్స కార్యక్రమాన్ని ఎమ్మెల్యే గడ్డం వినోద్ రమ దంపతులతో పాటు ఆయన కుమార్తె గడ్డం వర్ష అరుణ్ లు సందర్శించారు. అంతకుముందు వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రిని పరిశీలించి ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలు, సౌకర్యాలను రోగులను అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలో వైద్యులు, సిబ్బందితో సమావేశాన్ని ఏర్పాటు చేసి ఆసుపత్రికి వచ్చే పేద ప్రజలకు నాణ్యమైన వైద్యం అందేలా చూడాలని ఆదేశించారు. డాక్టర్ అజయ్ చక్రవర్తి బృందం అందిస్తున్న సేవలను ఎమ్మెల్యే గడ్డం వినోద్ ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి మున్సిపల్ అధ్యక్షురాలు జక్కుల శ్వేత, స్థానిక కౌన్సిలర్ బండి ప్రభాకర్, బెల్లంపల్లి పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు ముచ్చర్ల మల్లయ్య, మాజీ ఎంపీటీసీ సభ్యులు బొమ్మెన హరీష్ గౌడ్, నాయకులు గట్టు మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.