calender_icon.png 7 January, 2025 | 9:27 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహిళా క్యాంటీన్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే గడ్డం వినోద్

03-01-2025 01:32:59 PM

బెల్లంపల్లి,(విజయక్రాంతి): బెల్లంపల్లి పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం ఆవరణలో నూతనంగా నిర్మించిన మహిళా క్యాంటీన్ భవనాన్ని(Women Canteen Building) శుక్రవారం ఎమ్మెల్యే గడ్డం వినోద్(MLA Gaddam Vinod) లాంచనంగా ప్రారంభించారు. మహిళా సాధికారతే లక్ష్యంగా ప్రభుత్వం ప్రభుత్వ కార్యాలయాల దగ్గర మహిళా క్యాంటీన్ల నిర్మాణానికి కృషి చేసిందన్నారు. మహిళా సంఘాల సభ్యులు ఆర్థికంగా బలపడాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధ్యక్షురాలు జక్కుల శ్వేత, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావు, కౌన్సిలర్లు, మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.