04-04-2025 05:35:07 PM
బెల్లంపల్లి,(విజయక్రాంతి): బెల్లంపల్లి మండలంలోని కన్నాల గ్రామపంచాయతీలో శుక్రవారం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఇందిరమ్మ ఇల్లు పథకాన్ని ఎమ్మెల్యే గడ్డం వినోద్ లాంచనంగా ప్రారంభించారు. బెల్లంపల్లి మండలంలో కన్నాల గ్రామపంచాయతీ ఇందిరమ్మ ఇళ్ల పైలెట్ గ్రామంలో ఎంపిక చేశారు. గ్రామానికి చెందిన దోనేటి లావణ్య, రాజమౌళి దంపతుల ఇంటికి మొదటిసారిగా ఎమ్మెల్యే వినోద్ భూమి పూజ చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే వినోద్ మాట్లాడుతూ ఎన్నికల కు ముందు ప్రభుత్వం ఇచ్చిన హామీలో భాగంగా ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రవేశపెట్టడం పట్ల ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నట్లు చెప్పారు. పేదలకు అందించే సంక్షేమ పథకాలు కాంగ్రెస్ పార్టీతోని సాధ్యమని చెప్పారు.
సంక్షేమ పథకాలు అందిస్తున్న కాంగ్రెస్ పార్టీకి ప్రజలందరూ అండగా ఉండాలన్నారు. ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని తీగల అందరూ సద్వినియోగం చేసుకొని సకాలంలో ఇళ్లను నిర్మించుకోవాలని సూచించారు. ఇల్లు మంజూరు కానీ లబ్ధిదారులు నిరాశ చెందవద్దని సూచించారు. ప్రతి ఒక్క పేద కుటుంబానికి చెందిన పేద కుటుంబానికి ఇందిరమ్మ ఇంటికి అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. అంతకుముందు కాసిపేట మండలంలోని బుగ్గ గూడెం గ్రామంలో కూడా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే వినోద్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో మహేందర్, ఎంపీ ఓ శ్రీనివాస్ ,సీనియర్ కాంగ్రెస్ నాయకులు కారుకూరి రామ్ చందర్, టి పీసీసీ రాష్ట్ర ప్రచార కమిటీ కన్వీనర్ నూతన స్వామి, మండల పార్టీ అధ్యక్షులు సింగతి సత్యనారాయణ, జనరల్ సెక్రెటరీ జాలి మహేష్, కాంగ్రెస్ నాయకులు మునిమంద రమేష్ దూడెం మహేష్, ఆసంపెళ్లి నరసయ్య, భామండ్ల పెళ్లి భరత్, తోకల మల్లేష్, హౌసింగ్ అధికారులు పాల్గొన్నారు.