calender_icon.png 11 March, 2025 | 7:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శాంతిఖని గని లాంగ్‌వాల్ ప్రాజెక్టు విషయంలో ఎమ్మెల్యే తన వైఖరి స్పష్టం

09-03-2025 03:33:31 PM

బెల్లంపల్లి,(విజయక్రాంతి): బెల్లంపల్లిలోని శాంతిఖని గని లాంగ్ వాల్ ప్రాజెక్టు(Shanthikhani Mine Longwall Project) విషయంలో ఎమ్మెల్యే గడ్డం వినోద్ తన వైఖరిని స్పష్టం చేయాలని బాధిత రైతులు డిమాండ్ చేశారు. ఆదివారం బెల్లంపల్లి ప్రెస్ క్లబ్ లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. లాంగ్ వాల్ ప్రాజెక్టు విస్తరణపై నిర్వాసిత రైతులందరూ వ్యతిరేకంగా పోరాటం చేస్తుంటే ఎమ్మెల్యే వినోద్ రైతుల పక్షాన ఎందుకు పోరాటం చేయడం లేదని వారు ప్రశ్నించారు. ఎమ్మెల్యే వినోద్ గెలిచిన తర్వాత బెల్లంపల్లిలో ఉంటానని మాట ఇచ్చి మర్చిపోయారన్నారు. గెలిచిన అనంతరం బెల్లంపల్లి నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో లేరని ఆరోపణలు వస్తున్న పెద్దగా పట్టించుకోవడంలేదని వారు వాపోయారు. రైతుల పక్షాన నిలబడి లాంగ్ వాల్ ప్రాజెక్టు విస్తరణను అడ్డుకోవాలని డిమాండ్ చేశారు.

బెల్లంపల్లి మండలంలో రైతులు 16 వందల ఎకరాల్లో నిర్వాసితులుగా మారి నష్టం వాటిల్లుతున్న ఎమ్మెల్యే వినోద్ ఎందుకు మౌనం వహిస్తున్నారు అర్థం కావడం లేదని వారు వాపోయారు. లాంగ్ వాల్ ప్రాజెక్టు కోసం నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణలో రైతులంతా ముక్తకంఠంతో తమ గోడు వెల్లబుచ్చే ప్రయత్నం చేసిన పోలీసు బలగాలతో అణచివేశారని ఆరోపించారు. ఇప్పటికైనా బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ శాంతిఖని గని లాంగ్ వాల్ ప్రాజెక్టు విస్తరణ విషయంలో రైతులు జరుపుతున్న వ్యతిరేఖ పోరాటంలో కలసి రావాలని డిమాండ్ చేశారు. లాంగ్ వాల్ ప్రాజెక్టును రద్దు చేసేలా సింగరేణి పై ఒత్తిడి తీసుకురావాలని కోరారు. ఈ సమావేశంలో నిర్వాసిత రైతులు గోమాస శ్రీనివాస్, చదువుల వెంకటరమణ, గోమాస వినోద్, దుర్గం జయరాజ్, దుర్గం హరికృష్ణ, గోమాస మణిదీప్,  రామటెంకి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.