calender_icon.png 1 April, 2025 | 2:17 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సంపూర్ణ ఆరోగ్యం తోనే నిండు జీవితం

29-03-2025 12:23:14 PM

రూ 2 లక్షల 50 వేల ఎల్ఓసి చెక్కును అందించిన ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి

మహబూబ్ నగర్,(విజయక్రాంతి): సంపూర్ణ ఆరోగ్యంతోనే నిండు జీవితం సొంతం అవుతుందని దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి(Devarakadra MLA Madhusudhan Reddy) అన్నారు. మూసాపేట్ మండలం చక్రపూర్ గ్రామానికి జగదీష్ కుమారుడు శివప్రసాద్కి న్యూరో సంబంధిత ఆపరేషన్ కొరకు నిమ్స్ ఆస్పత్రికి సీఎం సహాయ నిధి ద్వారా రూ 2 లక్షల, 50,000లను వారి కుటుంబ సభ్యులకు అందజేసిన ఎమ్మెల్యే మధుసూధన్ రెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన వైద్య సేవలు అందించడం జరుగుతుందని, కార్పొరేట్ ఆసుపత్రిలో పేదలు వైద్య చికిత్సలు పొందుతున్న వారికి సీఎం సహాయనిధి ద్వారా ఆదుకోవడం జరుగుతుందని తెలిపారు. ఎక్కడ ఎవరికి ఆపద వచ్చిన అందుబాటులో ఉండి సేవచేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు తదితరులు ఉన్నారు.