calender_icon.png 11 March, 2025 | 3:39 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే

11-03-2025 12:49:38 AM

శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు

 ఇల్లెందు టౌన్, మార్చి 10 (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం బుజ్జాయిగూడెం గ్రామపంచాయతీ పరిధిలోని మోదులగూడెం లో రూ.15 లక్షల విలువైన అంతర్గత సిసి రహదారుల నిర్మాణం పనులకు  ఇల్లందు శాసనసభ్యులు కోరం కనకయ్య సోమవారం  శంకుస్థాపన చేశారు.

ఈ సందర్బంగా మాట్లాడుతూ ప్రభుత్వం ఒకపక్క సంక్షేమం, మరోపక్క అభివృద్ధి చేస్తుందన్నారు. గ్రామాల్లో అంతర్గత రహదారుల నిర్మాణంతో ప్రజల ఇబ్బందులు తొలగుతాయన్నారు. మండలంలో పలు గ్రామాల్లో అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శంఖుస్తాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ బానోత్ రాంబాబు, మాజీ ఎంపీపీ చీమల నాగరత్నమ్మ, మాజీ వైస్ ఎంపీపీ మండల రాము, మాజీ సర్పంచ్ చీమల వెంకటేశ్వర్లు, పి ఏ ఎస్ ఎస్ చైర్మన్ మెట్ల కృష్ణ, మాజీ సర్పంచ్ కల్తీ పద్మ, పాయం స్వాతి, కాంగ్రెస్ పార్టీ ఇల్లందు మండల అధ్యక్షులు పులి సైదులు, కార్యదర్శి ఆర్‌ఎం కిరణ్, ఉప సర్పంచ్ తాటి రాంబాబు, మండల యువజన నాయకులు బండి ఆనంద్, ఆముదాల ప్రసాద్, డి శివ, మంచాల సురేష్, అప్రిద్, ఎట్టి హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.