తలకొండపల్లి, జనవరి 24(విజయక్రాంతి): తలకొండపల్లి మండల కేంద్రానికి చెందిన పోతుగంటి బాలకిష్టయ్య ప్రమాదంలో గాయపడడంతో చేయి విరిగింది. హైదరాబాద్ లోని ప్రైయివేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలకిష్టయ్యను శుక్రవారం కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి ఆసుపత్రికి వెళ్లి పరమార్శించి ఆర్థిక సహాయం అందజేశారు. బాదితునికి మెరుగైన వైద్యం అందించాలని ఎమ్మెల్యే నారాయణరెడ్డి ఆసుపత్రి డాక్టర్లకు సూచించారు. ఎమ్మెల్యే వెంట కాంగ్రేస్ పార్టీ నాయకులు నర్శింహారెడ్డి, తుమ్మ నర్శింహా, బోళ్ల యాదగిరి, పురుషోత్తం, సురేష్ ఉన్నారు.