calender_icon.png 8 January, 2025 | 3:31 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మండలంలో ఎమ్మెల్యే విస్తృత పర్యటన

06-01-2025 05:29:04 PM

అశ్వారావుపేట (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట నియోజకవర్గం పరిధిలోని అశ్వారావుపేట మండలంలో స్థానిక ఎమ్మెల్యే జారే ఆదినారాయణ సోమవారం విస్తృతంగా పర్యటించారు. మొద్దులగూడెం గ్రామంలో పాఠశాల ప్రహరీ గోడ, కొత్త నారంవారీగూడెంలో డ్రైనేజ్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. కాలని, అల్లిగూడెం తదితర గ్రామాల్లో పంచాయతీ భవనాలను ప్రారంభించారు. అనంతరం చలి మంట కాగుతూ తీవ్ర గాయాలపాలైన మున్నూరు కాపు సంఘం మండల అధ్యక్షులు కురిశెట్టి నాగబాబు కుమారుడుని, రోడ్డు ప్రమాదంలో గాయపడిన కాంగ్రెస్ నాయకులు సుంకవల్లి వీరభద్రరావు కుమారుడుని పరామర్శించారు. ఎమ్మెల్యే వెంట కాంగ్రెస్ నాయకులు జూపల్లి రమేష్, చెన్నకేశవ రావు, ప్రమోద్, ఫణి మోహనరావు, అధికారులు పాల్గొన్నారు.