calender_icon.png 17 October, 2024 | 2:00 PM

తుంగతుర్తి బీటీ రోడ్లకు 15 కోట్ల మంజూరు..

17-10-2024 11:10:17 AM

గత పాలకుల నిర్లక్ష్యంతోనే రోడ్లు వెనుకంజ

ఎమ్మెల్యే మందుల సామేలు..

తుంగతుర్తి (విజయక్రాంతి): తుంగతుర్తి నియోజకవర్గ అభివృద్ధి ప్రధాత శాసనసభ్యులు మందుల సామేలు  ఆధ్వర్యంలో  రాష్ట్ర  పంచాయతీరాజ్ శాఖ మంత్రివర్యులు సీతక్క  నియోజకవర్గ పరిధిలోని పలు ప్రాంతాలకు బిటి రోడ్లు కావాలని ప్రతిపాదన ద్వారా కోరగా మన ఎమ్మెల్యే శ్రీ మందుల సామేలు  కృషి ఫలితంగా నేడు  15 కోట్ల రూపాయలతో బిటి రోడ్డు నిర్మాణానికి నిధులు సాంక్షన్ అయ్యాయి. శాలిగౌరారం మండలంలోని ఆకారం గ్రామం నుండి తక్కలపాడు వరకు 4.10 కిలోమీటర్లు మేరకు 3 కోట్ల 50 లక్షలు రూపాయలతో బిటి రోడ్డు నిర్మాణానికి సాంక్షన్  చేశారు.

అదేవిధంగా శాలిగౌరారం మండలం వల్లాల గ్రామం నుంచి జాలంవారి గూడెంకు 3.30 కిలోమీటర్ల మేర బీటీ రోడ్డు నిర్మాణానికి 2 కోట్ల 50 లక్షల రూపాయలను సాంక్షన్ చేశారు. అడ్డగూడూరు మండలంలోని గట్టుసింగారం, ధర్మారం కోటమర్తి పరిధిలోని తొమ్మిది కిలోమీటర్ల మేర 9 కోట్ల రూపాయలతో  బీటీ రోడ్డు నిర్మాణానికి  సాంక్షన్ చేయడం జరిగింది. గత పాలకుల నిర్లక్ష్యంతో నిధులు మంజూరు చేయకపోవడంతో వానాకాలంలో గ్రామీణ ప్రాంత ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారు. మొదట  దీన్ని గమనించిన ఎమ్మెల్యే పలుమార్లు ముఖ్యమంత్రిని సంబంధిత మంత్రులను కలిసి వినతి పత్రాల అందించడం ద్వారా నిధులు మంజూరు అయ్యాయి. మొత్తం నియోజవర్గంలో 15 కోట్ల నిధులు ఎమ్మెల్యే మందుల సామేలు కృషి ఫలితంగా మంజూరు చేయడం పట్ల నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు, వివిధ పార్టీ నాయకులు, ప్రజలు మేధావులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.