calender_icon.png 3 October, 2024 | 6:56 PM

తెలంగాణకే రాష్ట్రానికే తలమానికం.. డబుల్ ఇల్లు

03-10-2024 04:06:58 PM

జగిత్యాల సమగ్రాభివృద్ధి అంకితభావంతో కృషి చేస్తా

జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్

జగిత్యాల,(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రానికే తలమానికంగా డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణాలతోపాటు, జగిత్యాల నియోజకవర్గ సమగ్రాభివృద్ధికి అంకిత భావంతో కృషి చేస్తానని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు. గురువారం జగిత్యాల పట్టణ పొన్నాల గార్డెన్స్ లో పట్టణ, అర్బన్, రూరల్ మండలాలకు చెందిన 149 మంది ఆడబిడ్డల కు మంజూరైన ఒక కోటి 49 లక్షల 17 వేల కళ్యాణ లక్ష్మి చెక్కులను, 97 మంది లబ్ధిదా రులకు మంజూరైన 30 లక్షల రూపాయల విలువగల సీఎం సహాయనిధి చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో పని చేసి జగిత్యాల సమగ్రాభివృద్ధికి కృషి చేస్తానని వెల్లడించారు. అభివృద్ధి, సంక్షేమం ద్యేయంగా పనిచేస్తానన్నారు. జగిత్యాల డబల్ బెడ్ రూం ఇండ్లను రాష్ట్రానికే తలమానికంగా డబల్ బెడ్ రూం ఇండ్ల మౌలిక సదుపాయాల కోసం రూ.14 కోట్లతో పనులు ప్రారంభమ య్యాయన్నారు. నియోజక వర్గంలో ఆలయాల భజన మందిరం నిర్మాణానికి నిధులు మంజూరు చేశామన్నారు. కుల మతాలకు అతీతంగా అభివృద్ధి చేస్తానని, రూ.4 కోట్ల తో సమీకృత మార్కెట్ ప్రారంభించామన్నారు. ప్రజల సహకారం అవసరం అన్నారు. దాదాపు 30 వేల జనాభా కు ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు.

హోల్ సేల్ పూలు, పండ్ల మార్కెట్, పలు, ఇతర మాంసం మార్కెట్ లు రావడం వల్ల అందరికీ లాభదాయకం అన్నారు. పట్టణానికి వరద ప్రభావిత వార్డులకు జిల్లా కలెక్టర్ ను కోరగా రూ. 50 లక్షలు మంజూరు చేశారని, ప్రజల సౌకర్యార్థం పురపాలక సంఘం సభ్యులు త్వరితగతి న పనుల మొదలు పెట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ అడువాల జ్యోతి లక్ష్మణ్, వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్, పాక్స్ చైర్మన్  మహిపాల్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ గిరి నాగభూషణం, తహసిల్దార్లు రామ్మోహన్, శ్రీనివాస్, కౌన్సిలర్ లు, కో ఆప్షన్ సభ్యులు, మాజీ సర్పంచ్ లు, ఎంపీటీసీలు,ప్రజాప్రతినిదులు, రెవెన్యూసిబ్బంది,అధికారులు, తదితరులు పాల్గొన్నారు.