calender_icon.png 30 October, 2024 | 6:53 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నూతన విజన్ కు శ్రీకారం చుట్టిన ఎమ్మెల్యే డా.మైనంపల్లి రోహిత్

30-10-2024 04:42:27 PM

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి మాస్టర్ ఫ్లాన్ ను అందజేత

పంచాయితీరాజ్ శాఖ నుండి నిధులను మంజూరు చేయించండి

మెదక్ పట్టణ సుందీకరణకు నిధులు కేటాయించండి

నూతన పిజి కళాశాలకు అనుమతులు ఇప్పించండి

మెదక్ లో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ మంజూరుకు విజ్ఞప్తి

మెదక్ (విజయక్రాంతి): మెదక్ ప్రాంత అభివృద్ధికై నూతన విజన్ కు శ్రీకారం చుట్టడమే కాకుండా పలు శాఖల ద్వారా జరిగే అభివృద్ధిపై ఆయా శాఖలకు సంబంధించిన బడ్జెట్ ను కేటాయించాలని మెదక్ నియోజకవర్గ ఎమ్మెల్యే డా. మైనంపల్లి రోహిత్ బుధవారం హైద్రాబాద్ లోని సీఎం క్యాంప్ కార్యాలయంలో కలిసి పలు సంక్షేమ అభివృద్ధి కొరకు అవసరమయ్యే నిధులను కేటాయించాలని వినతి పత్రాని అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో దాదాపు ముప్పై నిమిషాల పాటు సుదీర్ఘంగా చర్చించారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ.. మెదక్ పట్టణంలో ట్రాఫిక్ పెరిగిపోతున్న తరుణంలో ట్రాఫిక్ ను నియంత్రించేందుకు నూతనంగా ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ను మంజూరు చేయాలని కోరినట్లు ఆయన తెలిపారు. అంతే కాకుండా హావేళిఘణపూర్, నిజాంపేట, మెదక్ రూరల్ తో పాటు పాపన్నపేట మండలంలో నూతనంగా పోలీస్ స్టేషన్ బంగ్లాలను మంజూరు చేయాలని, అంతే కాకుండా మెదక్ ప్రాంతం నుండి సిద్దిపేటకు తరలివెళ్ళిన డ్రగ్స్ అండ్ కెమిస్ట్రీ కార్యాలయానికి తిరిగి మెదక్ ప్రాంతానికి తరలించాలని ఆయన అన్నారు. అదే విధంగా ఏడుపాయల దేవస్థానం అభివృద్ధి కొరకు, కోంటూర్ చెరువు సుందీరకరణ కోసం, పోచారం అభయారణ్యం, మినిట్యాంక్ బండ్ తో పాటు మెదక్ పట్టణంలోని రాందాస్ చౌరస్తా, అంబేద్కర్ సర్కిల్, ధ్యాన్ చంద్ చౌరస్తా ల సుందరీకరణ కోసం టియుఎఫ్ఐడిసి ద్వారా నిధులు మంజూరు చేయాలని ఆయన విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు.

అంతే కాకుండా చిల్డ్రన్స్ పార్క్, షాపింగ్ కాంప్లెక్స్, చర్చి అభివృద్ధి, మెదక్ ఖిల్లా, అత్యాధునికమైన వైకుంఠ ధామం, ఇంటిగ్రేటెడ్ వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్, స్లాటెడ్ ఇండ్ల నిర్మాణం, కోతుల బెడద నివారణ, మల్లం చెరువు అభివృద్ధితో పాటు పట్టణంలో సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు కొరకు నిధులు మంజూరు చేయాలని ఆయన కోరినట్లు తెలిపారు. ఇదిలా ఉండగా మెదక్ జిల్లాలో బిటిరోడ్ల మరమ్మత్తులు, నూతనంగా బిటి రోడ్లు, బ్రిడ్జి ల నిర్మాణం, 4 లైన్ల రహదారి, సిసి డ్రైన్ లు, బాక్స్ కల్వర్ట్ లు, గెస్ట్ హౌజ్ ల నిర్మాణం కొరకు ఆయా శాఖ నుండి నిధులు మంజురు చేయించాలని ఆయన ముఖ్యమంత్రికి వినతి పత్రానికి ఇచ్చినట్లు పేర్కోన్నారు.