18-04-2025 01:55:05 AM
దేవరకొండ, ఏప్రిల్ 17: దేవరకొండ వ్యవసాయ మార్కెట్ యార్డులో లబ్ధిదారులకు ఎమ్మెల్యే బాలు నాయకర్ సూక్ష్మసేద్యం పరికరాలను (స్ప్రింక్లర్స్) గురువారం పంపిణీ చేశారు. ఈ సం దర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రభుత్వం అందజేసు సూక్ష్మసేద్య పరికరాలను సద్వినియోగం చేసుకుని రైతులు అధిక దిగుబడి సాధించాలని సూచించారు. కార్యక్రమంలో సిరాజ్ఖాన్, వెంకటయ్యగౌడ్, శ్రీశైలం యాదవ్, అరుణ సురేశ్గౌడ్, శ్రీధర్రెడ్డి, కృష్ణయ్య పాల్గొన్నారు.