08-04-2025 10:35:22 PM
ఇల్లెందు (విజయక్రాంతి): అనారోగ్యంతో బాధపడుతూ వివిధ ఆసుపత్రులలో చికిత్స పొందిన పలువురికి సీఎం సహాయనిధి ద్వారా మంజూరైన ఆర్థిక సహాయాన్ని ఇల్లందు శాసనసభ్యులు కోరం కనకయ్య మంగళవారం పంపిణీ చేశారు. నియోజకవర్గంలోని 108 లబ్ధిదారులకు రూ.34.5 లక్షల ఆర్థిక సహాయాన్ని చెక్కుల ద్వారా అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే కోరం మాట్లాడుతూ.. ఏటా వేలాది మంది పేద, మధ్య తరగతి ప్రజలకు సీఎం సహాయ నిధి ద్వారా ఆర్థిక చేయూతని అందించడం జరుగుతుందని, ఈ అవకాశాన్ని పేదలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పేదరికంతో బాధపడుతూ అనారోగ్యాల బారిన పడుతున్న వారికి వైద్య ఖర్చుల నిమిత్తం ఆర్థిక సాయం అందించడం ద్వారా ప్రభుత్వం భరోసాగా నిలుస్తుందనీ అన్నారు.
చెక్కులు తీసుకున్న లబ్ధిదారులు బ్యాంకులో వేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఇల్లందు మార్కెట్ కమిటీ చైర్మన్ బానోత్ రాంబాబు, మాజీ మున్సిపల్ చైర్మన్లు ఎదలపల్లి అనసూయ, దమ్మలపాటి వెంకటేశ్వర్లు, మాజీ వైస్ ఎంపీపీ మండల రాము, పట్టణ మండల అధ్యక్షులు దొడ్డ డానియల్, పులి సైదులు మాజీ ఎంపీటీసీలు పూనెం సురేందర్, పాయం కృష్ణ ప్రసాద్, మాజీ సర్పంచులు పాయం లలిత, కల్తీ పద్మ, తాటి చుక్కమ్మ, నియోజకవర్గ నాయకులు మడుగు సాంబమూర్తి, బోళ్ల సూర్యం, డి శివకుమార్, సుదర్శన్ కోరి, యువజన నాయకులు ఈసం లక్ష్మణ్, ఉల్లింగ సతీష్, పట్టణ మండల నాయకులు, 24వ వార్డుల నాయకులు, మహిళా కమిటీ, తదితరులు పాల్గొన్నారు.