కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): ఫారెస్ట్ అధికారుల దౌర్జన్యాలను నిరసిస్తూ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు సోమవారం సిర్పూర్ టి రేంజ్ కార్యాలయం ఎదురుగా నిరాహార దీక్షకు కూర్చున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నియోజకవర్గంలో అటవీశాఖ అధికారుల తీరుపై ప్రజలు విసిగిపోతున్నారని ఆరోపించారు. ఇటీవల పలువురిపై థర్డ్ డిగ్రీ ఉపయోగించి తీవ్రంగా బాధితులను కొట్టడం జరిగిందన్నారు. ఈ చర్యలకు పాల్పడ్డ అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఫారెస్ట్ అధికారులు చేపడుతున్న సర్వేను వెంటనే నిలిపివేయాలని లేనిపక్షంలో ఆందోళన చేస్తామన్నారు. రెవెన్యూ భూములను అటవీశాఖ అధికారులు వచ్చి తమదంటూ రైతులను ఇబ్బందుల గురి చేస్తున్నారని ఆరోపించారు. రెవెన్యూ, ఆటవి శాఖ అధికారులు జాయింట్ సర్వే చేయాల్సింది పోయి ఏకపక్షంగా సర్వే నిర్వహించడం సరికాదన్నారు.