కేటీఆర్ కు నేను క్లీన్ చిట్ ఇవ్వలేదు
ఫార్ములా-ఈ రేసు హైదరాబాద్ కు మంచిదే
హైదరాబాద్: హైడ్రా వల్ల హైదరాబాద్ నగరానికి చాలా నష్టం జరుగుతోందని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్(Khairatabad MLA Danam Nagender) అన్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్(KTR) కు తాను క్లీన్ చిట్ ఇవ్వలేదని దానం నాగేందర్ తెలిపారు. ఫార్ములా- ఈ రేసు హైదరాబాద్ కు మంచిదేనని దానం పేర్కొన్నారు. కాంగ్రెస్ హయాంలోనే హైదరాబాద్ ఇమేజ్ పెరిగిందని చెప్పారు. ఫార్ములా-ఈ రేసులో హైదరాబాద్ ఇమేజ్(Hyderabad Image) మరింత పెరిగిందని సూచించారు. ఫార్ములా-ఈ రేసు(Formula-E race) నిర్వహణను తప్పుపట్టట్లేదని ఆయన తెలిపారు. ఫార్ములా- ఈ రేసులో క్విడ్ ప్రోకో జరిగినట్లు అనుమానం ఉందన్నారు. ఆర్థిక పరిస్థితి వల్ల ఫార్ములా-ఈ రేసును ప్రభుత్వం రద్దు చేసిందని దానం తెలిపారు. 'నేను ఫైటర్ నీ.. ఉపఎన్నికలకు భయపడను' అని ఎమ్మెల్యే దానం నాగేందర్ స్పష్టం చేశారు. దానం నాగేందర్ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.